: గవర్నర్ సమక్షంలో బాబు, కేసీఆర్ ప్రత్యేక భేటీ


గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగుల పంపకాలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు సమాచారం. కాగా, ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల స్పీకర్లు, సీఎస్ లు, క్యాంప్ ఆఫీస్ కార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమైన వీరిద్దరూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. సమావేశానికి ముందు చంద్రబాబు గవర్నర్ తో కొద్దిసేపు మాట్లాడినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News