: షూలో 20 లక్షల విలువైన బంగారం


స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, అండర్ వేర్లు, షూలలో బంగారం పెట్టుకుని వచ్చేస్తున్నారు. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను కోవై విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపూర్ జిల్లా పట్టుకోట్టైకు చెందిన నవూస్‌ఖాన్ కుమారుడు జాహీర్‌ హుస్సేన్(30) అనే వ్యక్తి సింగపూర్ ఏయిర్‌లైన్స్ విమానంలో తిరువొత్తియూరులోని కోవై విమానాశ్రయానికి వచ్చారు. జహీర్ హుస్సేన్ దర్జాగా వెళ్లిపోతుండగా మెటల్ డిటెక్టర్ కూత కూసింది. అప్రమత్తమైన అధికారులు అతనిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని షూలో బంగారం బిస్కెట్లను ముక్కలుగా కట్‌చేసి దాచినట్టు తేలింది. అతని షూ నుంచి 850 గ్రాముల బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News