: ఎబోలా గురించి భయపడాల్సిన అవసరం లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించదని... సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. గతంలో ఈ వ్యాధి మన దేశంలో వ్యాపించినట్టు దాఖలాలు కూడా లేవని తెలిపారు. ఈ వ్యాధి ప్రబలిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయడం కంటే... వాటిని నివారించడమే మేలని అన్నారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.