: భారత్, బర్మా సరిహద్దులో భూకంపం
భారత్, బర్మా సరిహద్దులో ఓ మోస్తరు భూకంపం సంభవించింది. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.