: టీమిండియా ప్రదర్శన సిగ్గుచేటు: కీర్తి అజాద్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్రంగా స్పందించారు. భారత క్రికెట్ జట్టు కనబరుస్తున్న ఆటతీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తాము దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నామని, ప్రస్తుత జట్టు ప్రదర్శనకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సౌరవ్ గంగూలీ సారథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ప్రపంచాన్ని ఏలిందని చెప్పుకొచ్చారు. కోల్ కతాలో ఓ సభలో మాట్లాడుతూ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.