: ఈ రోజుల్లో గాళ్ ఫ్రెండ్ లేకుండా ఎవరుంటున్నారయ్యా?: బీహార్ సీఎం
బీహార్ సీఎం జితన్ రామ్ మంఝీ మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ మహిళా పోలీస్ ను వేధించిన ఘటనలో తన కుమారుడి పాత్ర కూడా ఉందని బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో గాళ్ ఫ్రెండ్ లేకుండా ఎవరుంటున్నారని ప్రశ్నించారు. సదరు మహిళ పట్ల తన పుత్రుడు అసభ్యంగా ప్రవర్తించాడనడానికి ఆధారాల్లేవని అన్నారు. హోటల్ సీసీటీవీ ఫుటేజిలో కూడా ఏమీ ఆధారాలు లభ్యం కాలేదు కదా? అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఆరోపణలు నిరాధారమని మంఝీ అన్నారు. నేటికాలంలో గాళ్ ఫ్రెండ్ ఉండడం సర్వసాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, మహిళపై వేధింపుల వ్యవహారం నుంచి కుమారుడిని మంఝీయే తప్పించారని బీజేపీ ఆరోపించడం తెలిసిందే.