: ఫిఫా ర్యాంకింగ్స్ లో మనవాళ్ళు పైకెగబాకారు!
వరల్డ్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఫిఫా) తాజాగా ప్రపంచ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు 150వ స్థానం లభించింది. ఇంతకుముందు 154వ స్థానంలో ఉన్న మనవాళ్ళు ఏకంగా 4 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవుల జట్లు మనకంటే ముందున్నాయి. కాగా, ఫిఫా ర్యాంకుల జాబితాలో వరల్డ్ చాంపియన్ జర్మనీ అగ్రస్థానాన్ని అధిష్ఠించింది. తర్వాతి స్థానాల్లో వరుసగా అర్జెంటీనా, నెదర్లాండ్స్, కొలంబియా, బెల్జియం ఉన్నాయి.