: 5 కిలోల బరువుతో జన్మించిన శిశువు
సాధారణంగా 4 కేజీల బరువుతో శిశువు జన్మిస్తే భారీగా పుట్టినట్టే లెక్క. అలాంటిది, ఎం. సంతోషి అనే మహిళకు ఏకంగా 5 కిలోల బరువున్న శిశువు జన్మించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా వి.కోట సామాజిక ఆసుపత్రిలో ఈ ఉదయం జరిగింది. సాధారణ ప్రసవంలో 5 కిలోల బరువున్న శిశువు జన్మించడం అత్యంత అరుదని ఆసుపత్రి సూపరింటెండెంట్ దిలీప్ తెలిపారు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను తదుపరి పరీక్షల నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.