: రేపు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు రేపు (ఆదివారం) సమావేశం కానున్నారని సమాచారం. రాజ్ భవన్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల వివాదాస్పద అంశాలపై సీఎంలు చర్చించుకోనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో చంద్రబాబు, కేసీఆర్ లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ తమ రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గవర్నర్ చొరవతో అంగీకరించారని తెలుస్తోంది. విభజన తర్వాత ముఖ్యమంత్రులుగా పదవి చేపట్టిన బాబు, కేసీఆర్ లు అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News