: కంగారు పడకండి... నా ఆరోగ్యం బాగానే ఉంది: రజనీకాంత్


భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం తాను ఆరోగ్యంగానే ఉంటానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 'లింగా' సినిమా షూటింగులో పాల్గొనేందుకు ఆయన మంగళూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని... ప్రస్తుతానికి బాగున్నానని స్పష్టం చేశారు. ఇటీవల షూటింగులో రజనీ తూలి కిందపడబోయారనే వదంతులు ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News