: మహబూబ్ నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ
ప్రపంచాన్ని ఎంబోలా వ్యాధి వణికిస్తుండగా, మహబూబ్ నగర్ జిల్లాను స్వైన్ ఫ్లూ కేసు వణికించింది. దౌల్తాబాద్ మండలం బంగ్లా తండాకు చెందిన ఒక వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్టు తెలిసింది. బాధితునికి వైద్య పరీక్షలు చేసిన వైద్యబృందం స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారించింది. గతంలో స్వైన్ ఫ్లూ ప్రాణాంతకంగా పరిణమించినప్పటికీ ఇప్పుడు దానిని నియంత్రించే ముందులు అందుబాటులోకి వచ్చాయి.