: కాంగ్రెస్ ఓటమికి కారణాలివే... నివేదిక సమర్పించిన ఆంటోనీ కమిటీ


లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి కారణాలు, విశ్లేషణలతో ఏకే ఆంటోనీ కమిటీ రూపొందించిన నివేదికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు. కాంగ్రెస్ ఘోరపరాజయానికి కారణాలు తెలపాలని కోరుతూ ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్ సీ కుంతియా, అవినాశ్ పాండేలతో ఓ కమిటీని సోనియా నియమించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, పార్టీ నేతలతో మాట్లాడిన కమిటీ రాష్ట్రాల వారీగా భారీ నివేదిక తయారు చేసింది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలపై దృష్టి పెట్టిన కమిటీ అన్ని కారణాలను పేర్కొంది. రాహుల్ నాయకత్వ లోపం లేదని తెలిపింది. మీడియాను మోడీ ఉపయోగించుకున్నంత సమర్థవంతంగా కాంగ్రెస్ వాడుకోలేదని తేల్చింది. అలాగే పార్టీలోని సంస్థాగత బలహీనతలను కూడా తూర్పారపట్టింది.

  • Loading...

More Telugu News