: చిత్తుగా తాగి క్లాస్ రూంలో హల్ చల్ చేసిన లేడీ టీచర్


అమెరికాలోని ఆరిజోనాలో ఓ గణిత ఉపాధ్యాయురాలు మద్యం పుచ్చుకుని క్లాస్ రూంకు రావడమే గాకుండా, అక్కడా మందు బాటిల్ ముందుపెట్టుకుని నానా హంగామా చేసింది. ఆ తాగుబోతు టీచర్ పేరు కథ్లీన్ జార్డైన్ (57). నడివయసులో ఉన్న ఈమె పోస్టన్ బట్ హైస్కూల్లో లెక్కల పంతులమ్మగా పనిచేస్తోంది. ఓ రోజూ తూలుతూ వచ్చిన జార్డైన్, నేరుగా తన క్లాస్ రూంలోకి వెళ్ళి వోడ్కా బాటిల్ ఓపెన్ చేసింది. తాగి అంతటితో ఊరుకోకుండా పిల్లల ముందు నోటికి వచ్చినట్టు వాగడం మొదలుపెట్టింది. దీంతో, ఓ విద్యార్థి ఈ విషయాన్ని పాఠశాల అధికారులకు తెలిపాడు. వెంటనే స్పందించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. బహిరంగ స్థలాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేసిందన్న నేరంపై వారు అమ్మడిపై అభియోగాలు మోపేందుకు వారు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. కాగా, జార్డైన్ ను ఆసుపత్రికి తరలించిన అధికారులు ఆమె రక్తంలో ఆల్కహాల్ శాతాన్ని చూసి షాక్ తిన్నారు. బ్లడ్ టెస్టు చేయగా, అందులో ఆల్కహాల్ 205 శాతం ఉందట. ఆ స్థాయిలో ఉండడాన్ని 'సూపర్ ఎక్స్ ట్రీమ్' గా పేర్కొంటారట. కాగా, జార్డైన్ తాగి స్కూల్ కి రావడం ఇదే మొదటిసారి కాది. 2011లో న్యూమెక్సికోలో పనిచేస్తున్న సమయంలోనూ ఇలాగే చేసిందట.

  • Loading...

More Telugu News