: గుంటూరులో నిరుద్యోగులకు శఠగోపం పెట్టిన రాజేష్ అరెస్టు


గుంటూరులో నిరుద్యోగులకు శఠగోపం పెట్టిన రాజేష్ అనే ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా కేంద్రం, చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్రభుత్వంలోని నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని మాయమాటలు చెప్పిన రాజేష్ అందినకాడికి దండుకున్నాడు. చాలామంది నుంచి లక్షల్లో వసూలు చేసిన రాజేష్ ఎంతకీ ఉద్యోగాల ఊసెత్తకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

  • Loading...

More Telugu News