: మోడీది 'జీరో ఎఫెక్ట్' ప్రసంగం: కాంగ్రెస్ విమర్శల దాడి


ప్రధాని హోదాలో ఎర్రకోటపై నుంచి తొలిసారి ప్రసంగించిన నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శల దాడికి దిగింది. ఆయన ప్రసంగ ప్రభావం శూన్యమని కొట్టిపారేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాధారణ సమస్యలనే ప్రస్తావించారని దుయ్యబట్టింది. కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలు ఏవీలేవని ఎద్దేవా చేసింది. మోడీ ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్ళలో జాతిని ఎలా ముందుకు తీసుకెళతారన్న దానిపై ప్రధాని వివరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తూ ఆయన సాదాసీదా అంశాలకే పరిమితమయ్యారని తివారీ పెదవి విరిచారు. సందర్భానికి తగినట్టుగా మాట్లాడలేదని విమర్శించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మద్... మోడీ ప్రసంగాన్ని 'జీరో ఎఫెక్ట్' ప్రసంగంగా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News