: అక్టోబర్ 2 నుంచి పథకాల పండుగ
అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో పలు పథకాలను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆ రోజు నుంచి నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ సుజల పథకంతో పాటు మూడు నగరాల్లో ఎన్టీఆర్ బడ్జెట్ క్యాంటీన్లు, వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయల పించను అందజేత పథకాలు అదే రోజున ప్రారంభమవుతాయని బాబు పేర్కొన్నారు. 68వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కర్నూలులో మాట్లాడుతూ బాబు ఈ విషయాలు తెలిపారు.