: తెలంగాణ సర్కారుతో చర్చలకు సిద్ధం: చంద్రబాబు


విభజన అనంతరం తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారుతో చర్చలకు సిద్ధమని తెలిపారు. వివాదాస్పద అంశాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవడం మేలని సూచించారు. విభేదాలు రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని బాబు అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలకే మొగ్గుచూపుతామని చెప్పారు. కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News