: ప్రతి పనికి ఉద్యోగులు 'నాకేంటి?' అని అడుగుతున్నారు: మోడీ
ఎర్రకోట ప్రసంగంలో మోడీ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని కోసం సామాన్యులు వెళితే ఉద్యోగులు ఆ పని చేస్తే 'నాకేంటి?' అని అడుగుతున్నారని మోడీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రకమైన ప్రవర్తన మానుకోవాలని...'నాకేంటి?' అనే భావన బదులు 'మనం' అనే భావన ఉద్యోగులకు రావాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మోడీ వ్యాఖ్యానించారు.