: మరోసారి తన ప్రత్యేకతను చాటుకోనున్న మోడీ... ఆశువుగా మోడీ ఎర్రకోట ప్రసంగం
సాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోనున్నారు. సాధారణంగా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరూ ముందే తయారుచేసుకున్న ప్రసంగ పాఠాన్ని ఎదురుగా పెట్టుకుని, ఎర్రకోట నుంచి చదవడం ఆనవాయతీగా వస్తోంది. అయితే, దీనికి భిన్నంగా మోడీ కాసేపట్లో ఆశువుగా ప్రసంగించనున్నారు. తన ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలు... విధానాలను మోడీ ఈ ప్రసంగంలో స్పష్టం చేయనున్నారు.