: పంద్రాగస్టున ఇదీ ప్రధాని షెడ్యూల్
రేపు ఉదయం రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పిస్తారు. శుక్రవారం ఉదయం 7.30కి ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు చేరుకుంటారు. 7.40 గంటలకు మోడీ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 7.45కి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.