: సింగపూర్ లో భారతీయుడికి 25 నెలల జైలుశిక్ష విధింపు
సింగపూర్ లో నివసిస్తున్న భారతీయుడికి 25 నెలల జైలు శిక్ష పడింది. గత డిసెంబరులో సింగపూర్ లోని లిటిల్ ఇండియాలో జరిగిన అల్లర్లపై విచారించిన అక్కడి జిల్లా కోర్టు... 25 నెలల జైలుశిక్ష విధించింది. ఈ ఘటనలో అతడు ఆరో నిందితుడు. లిటిల్ ఇండియాలో భవన నిర్మాణం పనిచేసే సామియప్పన్ చెల్లదురై (42) అనే వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో చెల్లదురై అధికారుల వాహనాలపై కాంక్రీట్ రాళ్లు రువ్వినట్లు పోలీసులు అభియోగం మోపారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది.