: పెళ్లి చేసుకోనని చెప్పడంతో... ఆమెపై అత్యాచారం చేశాడు
తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా తన స్నేహితురాలిని ఆ యువకుడు కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువతి స్నేహితుడు దామోదర్ సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువకుడితో తనకు ఆరు నెలలుగా స్నేహం ఉందని, అయితే పెళ్లికి నిరాకరించడం వల్లనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.