: తాత్కాలిక రాజధాని వల్ల సీమాంధ్రకు 500 కోట్లు వస్తాయ్: చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల సీమాంధ్రకు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. గురువారం రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్య కార్యాలయాలు ఉండటం వల్ల ఆదాయం అంతా తెలంగాణకు వెళ్తుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముందుచూపుతో విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశారని డిప్యూటీ సీఎం అన్నారు.