: కేసీఆర్ మరో యాంగిల్!


కల్వకుంట్ల చంద్రశేఖరరావు... కేసీఆర్ గా అత్యంత సుపరిచితుడైన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మండిపడని ఆంధ్ర నేతలుండరు. అంతలా కసి రేకెత్తించేట్టు వ్యవహరించడంలో ఈ బక్కపలుచని నేత మహాదిట్ట. కానీ, ఆయనలో పక్కా రాజకీయవేత్తే కాదు, ఓ నికార్సైన మానవతావాది కూడా ఉన్నాడు. అందుకిదే నిదర్శనం. వరంగల్ జిల్లా నర్మెట్టకు చెందిన శరత్ అనే చిన్నారి గుండెజబ్బు కారణంగా మృత్యువుతో పోరాడుతున్నాడు. హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి ఓ అరుదైన కోరిక కోరాడు. చివరిగా తనకు కేసీఆర్ ను చూడాలనుందని మనసులో మాట వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ మరేమీ ఆలోచించకుండా అపోలోకు పయనమయ్యారు. అక్కడ చిన్నారి శరత్ ను పరామర్శించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరత్ కు మెరుగైన వైద్యం కోసం ఆర్ధిక సాయం చేస్తామని, అతని కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News