: జ్యుడీషియల్ కమిషన్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడీషియల్ కమిషన్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు జరిగిన ఓటింగ్ లో 177 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దాంతో బిల్లు పాస్ అయినట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ క్రమంలో కొలీజియం వ్యవస్థకు పార్లమెంటు స్వస్తి పలికింది. నిన్న (బుధవారం) లోక్ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో ఏర్పడే ఓ కమిటీ జడ్జిల నియామకం, బదిలీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News