: గవర్నర్ అధికారాలపై హైకోర్టులో పిటిషన్ కొట్టివేత
హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. దీనిని మళ్లీ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (పిల్) వేయాలని పిటిషన వేసిన న్యాయవాది గంధం మోహన్ రావుకు సూచించింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్రం కొన్ని రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి కూడా తెలిసిందే.