: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వల్ప అస్వస్థత


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర కింది భాగంలో నొప్పి కారణంగా ఇబ్బంది పడ్డ ఆయనను బుధవారం రాత్రి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు. రాజ్ నాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు తెలిపారు. ‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయంలో పగటి పూట వైద్య పరీక్షలు చేయించుకుంటే సమయం వృథా అవుతుందని రాజ్ నాథ్ భావించారు. ఈ క్రమంలో కొన్ని వైద్య పరీక్షల కోసం బుధవారం రాత్రి ఎయిమ్స్ లో చేరారు. గురువారం నాటి పార్లమెంట్ సమావేశాలకు ఆయన యథావిథిగా హాజరవుతారు’ అని రాజ్ నాథ్ సన్నిహితులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News