: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది: మోత్కుపల్లి


తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ (బుధవారం) రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు సెక్యూరిటీని కుదించడంపై వారు గవర్నరుకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పోకడలపై గవర్నరుకు ఫిర్యాదు చేశామని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పారు. గవర్నరును కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావును నక్సల్స్ నుంచి ముప్పు ఉందని, ఆయనకు కల్పించిన భద్రతను కుదించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణ టీడీపీ నేత రమణకు ఉన్న సెక్యూరిటీని తీసివేయడం తెలంగాణ ప్రభుత్వానికి తగదన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని ఆయన అన్నారు. గత 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న తమ ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News