: మేము మీకు వివరణ ఇవ్వడమేంటి?... అధికారాలు గవర్నర్ కే: కేంద్రం
ఉమ్మడి రాజధానిపై గవర్నరుకు అధికారాలు అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. హైదరాబాద్ శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. గవర్నర్ అధికారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని లేఖ రాయనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ఉమ్మడి రాజధానిలో గవర్నరుకు అధికారాలు కట్టబెట్టామని కేంద్రం స్పష్టంగా తెలిపింది. సెక్షన్ 8లో లేని అధికారాలను గవర్నరుకు ఇచ్చారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను అర్థరహితమైన వాదనగా కేంద్రం కొట్టిపడేసింది.