: ముద్దుగుమ్మ నడిచింది రెండు నిమిషాలే... 10 లక్షలు వసూలు చేసింది!


సినీ తారలు జోరుమీద ఉంటే వారికి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. తమపై అభిమానులు కురిపించే పిచ్చి అభిమానాన్ని క్యాష్ చేసుకోవడంలో సినీనటులను మించినవారు ఎవరూ లేరు. సామాన్య జనానికి కనిపించే షాప్ ఓపెనింగ్స్ కి ఓ రేటు, గానాబజానాలకి ఓ రేటు, మోడలింగ్ కి ఓ రేటు. ఇలా ఫిక్స్ డ్ రేట్లతో అభిమానులను అలరిస్తుంటారు సినీనటులు. రెండు నిమిషాల నడక కోసం 10 లక్షల రూపాయల వసూలు చేసిందో టాలీవుడ్ ముద్దుగుమ్మ. తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని అగ్రనటిగా అలరారుతున్న సమంత హైదరాబాదులో జరిగిన ఫ్యాషన్ షోలో రెండే రెండు నిమిషాలు తళుక్కుమంది. దుస్తుల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత, బ్రాండ్ రేటుకు అదనంగా, ఇలా ర్యాంప్ పై నడిచినందుకు అక్షరాలా పది లక్షలు పుచ్చుకుందట. ఎంతైనా సమంత కదా...ఆ మాత్రం పుచ్చుకోకుంటే అందమేముంటుంది?

  • Loading...

More Telugu News