: కూలీలతో కలసి నాట్లు వేసిన కలెక్టర్!
ఐఏఎస్ అధికారులు కొత్త పద్ధతులకు నాంది పలుకుతున్నారు. ప్రజలతో మమేకమై పనులు చేసుకుపోతున్నారు. ప్రజల కష్టనష్టాలు వినడానికే కాకుండా వారితో కలసిపోయి వారి జీవనసరళి గమనించేదుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటి సందర్భాల్లోనే వారి జీవన విధానం పూర్తిగా తెలుస్తుందని నిశ్చితాభిప్రాయంతో వారి దైనందిన జీవితాల్లోకి చొచ్చుకుపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ వ్యవసాయ కూలీల కష్టాలు తెలుసుకున్నారు. మార్గమధ్యంలో ఆమె కారుదిగి, నాట్లు వేస్తున్న రైతులతో కలసి నాట్లు వేశారు. సాక్షాత్తు కలెక్టర్ తమతో కలసి నాట్లు వేయడంతో కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను కలవడానికి, వారి కష్టనష్టాలు తెలుసుకునేందుకు ఇదొక విధానమని కలెక్టర్ తెలిపారు.