: రితేష్ దేశ్ ముఖ్ చేతులు కాలాయి


బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ చేతులు కాలాయి. భార్య జెనీలియాకు వంటచేస్తూ చేతులు కాల్చుకోలేదు. ‘బంగిస్థాన్’ సినిమా షూటింగ్ లో చిన్నపాటి ప్రమాదం సంభవించిందని, ఆ ప్రమాదంలో చేతులు కాలాయని ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. సన్నివేశంలో సహజత్వం రావాలంటే లీనమవ్వక తప్పదని, ఇలాంటి చిన్న చిన్న సాహసాలు చేయక తప్పడం లేదని రితేష్ తెలిపాడు. కాగా కామెడీ ప్రధానంగా నిర్మితమవుతున్న బంగిస్థాన్ లో రితేష్ దేశ్ ముఖ్, పులకిత్ సమ్రాట్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది.

  • Loading...

More Telugu News