: దాశరథి స్మారక అవార్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య పేరుపై స్మారక అవార్డు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు పేరిట ప్రతి ఏడాదీ ఒక సాహితీవేత్తకు రూ.లక్షా వెయ్యి నూటపదహార్లు బహుమతిగా అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. పోయిన నెల 22న జరిగిన దాశరథి 89వ జయంతి వేడుకల్లో ఆయన పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.