: అశుద్ధం తినిపించి... నగ్నంగా ఊరేగించారు


సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మూఢనమ్మకాలు ప్రబలిపోతూనే ఉన్నాయి. బీహార్ లోని కతిహార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సక్రైలి గ్రామంలో ఓ బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వాడికి కినియా దేవి అనే మధ్యవయస్కురాలు చేతబడి చేస్తోందని ఆరోపిస్తూ బాలుడి బంధువులు ఆమెను చావగొట్టారు. అంతటితో వారి కోపం చల్లారక ఆమెతో అశుద్ధం (మలం) తినిపించి, నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థులు అడ్డుకోకపోవడం విశేషం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేశారు. చాలా కాలంగా బీహార్ లోని మారుమూల ప్రాంతాల్లో చేతబడి పేరిట మహిళలను చిత్రహింసలకు గురి చేయడం సాధారణం. దీనిపై బీహార్ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News