: భగ్గుమంటున్న అమెరికా విమాన టిక్కెట్ల ధరలు


విమానాలు గగన విహారం చేస్తుంటే... విమాన టిక్కెట్ల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా వెళ్లే విమాన టిక్కెట్ల ధరలన్నీ ఇప్పుడు భగ్గుమంటున్నాయి. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు ఉంది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ కొత్త సెమిస్టర్లు ప్రారంభమవుతున్నాయని, అందుకే ఇంత ఎక్కువ ధరలు పలుకుతున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. దానికి తోడు అక్కడ స్వామి నారాయణ్ మహోత్సవం కూడా జరుగుతోంది. స్వామి నారాయణ్ భక్తులు న్యూజెర్సీలో నిర్మిస్తున్న అతిపెద్ద అక్షర ధామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది పయనమవుతున్నారు. దాంతో అన్ని విమానయాన సంస్థల ఎకానమీ క్లాస్ టిక్కెట్లు దాదాపు లక్ష రూపాయల ధర పలుకుతున్నాయని ట్రావెల్ ఏజెంట్స్ అంటున్నారు.

  • Loading...

More Telugu News