: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం నిధుల విడుదల
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.45 లక్షలను రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఈసారి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు.