: మోడీ పరుష వ్యాఖ్యలకు అటు నుంచి జవాబొచ్చింది!
తమతో పోరాడే దమ్ములేక తీవ్రవాదులను ఉసిగొల్పుతోందని పాకిస్థాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ వెంటనే స్పందించింది. మోడీ ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపింది. ఆయన వ్యాఖ్యలు నిరాధారమని పేర్కొంది. సరిహద్దుల్లో ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని పాక్ ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కాశ్మీర్లోని లేహ్ వద్ద మోడీ మాట్లాడుతూ, భారత సైనికులు యుద్ధం కంటే టెర్రరిజం కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నేరుగా పోరాడే సత్తా లేక ఉగ్రవాద రూపంలో పరోక్ష యుద్ధం చేస్తోందని దుయ్యబట్టారు.