: ఇస్లాం మతం స్వీకరించడంపై యువన్ శంకర్ రాజా వివరణ


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చిన్న కుమారుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ ఏడాది మొదట్లో ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఓ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో యువన్ వివరణ ఇచ్చారు. మూడేళ్ల కిందట తన తల్లి మరణంతో బాగా ఏడ్చానని, అనంతరం పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాననీ అన్నాడు. కొన్ని రోజులకు తన స్నేహితుడు చెప్పడంతో ఖురాన్ చదవడం మొదలుపెట్టానని, అప్పుడే ఇస్లాం మతాన్ని ఆచరించడం కూడా ప్రారంభించానని పేర్కొన్నాడు. అనంతరం 2014 జనవరిలో మతం మారాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ విషయంలో తన తండ్రి ఇళయరాజా నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇస్లాంలోకి మారాలనే నిశ్చయించుకున్నట్టు వెల్లడించాడు. అందుకు తన సోదరుడు, వదిన మద్దతు పలికారని చెప్పాడు. అప్పుడు తన పేరును కూడా ఇస్లాంకు అనుగుణంగా మార్చుకున్నానన్నాడు.

  • Loading...

More Telugu News