: మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్


పాకిస్తాన్ మరోమారు తన నైజాన్ని చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ పర్యటన ముగిసిన మరుక్షణమే తిరిగి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మంగళవారం మోడీ కాశ్మీర్ పర్యటన ముగిసిన అనంతరం రాత్రి 12 గంటలకు కాల్పులు మొదలుబెట్టిన పాక్ రేంజర్లు, దాదాపు గంటపాటు బీఎస్ఎఫ్ పోస్టుల పైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. జమ్మూ జిల్లా ఆర్మియా, ఆర్ఎస్ పురా పరిధిలోని పిటాల్, కాకూ దీ కోతే, టెంట్ పోస్టులపైకి పాక్ జరిపిన కాల్పులకు ధీటుగా బీఎస్ఎఫ్ జవాన్లు కూడా కాల్పులకు దిగాల్సి వచ్చిందని ఓ సైనికాధికారి చెప్పారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు ప్రారంభించిన పాక్ రేంజర్లు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే, కాల్పుల వైపు సైన్యం దృష్టి మరల్చి, చొరబాటుదారులకు పాక్ సైనికులు మార్గం సుగమం చేసే అవకాశాలుండటంతో భారత సైన్యం ఆ దిశగానూ చర్యలు తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News