: డాబా వద్ద నిద్రిస్తున్న లారీ డ్రైవర్లపై దోపిడీ దొంగల దాడి
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్పగూడెం వద్ద ఓ డాబా వద్ద నిద్రిస్తున్న లారీ డ్రైవర్లపై దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేశారు. వారివద్ద భారీగా నగదు దోచుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రాంతంలో తరచుగా దోపిడీలు జరగడంపై లారీ డ్రైవర్లు మండిపడుతున్నారు.