: హైదరాబాదీల అమానవీయ ప్రవర్తనపై ప్రకాష్ రాజ్ ఆవేదన


మంగళవారం ప్రకాష్ రాజ్ ప్రయాణిస్తున్న కారును మాదాపూర్ లోని సైబర్ టవర్స్ సమీపంలో సోనీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ప్రకాష్ రాజ్ కారు దెబ్బతిన్నప్పటికీ... ఆయన ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోగలిగారు. అదే బస్సు ఆయన కారుతో పాటు పక్కనున్న ఆటోను కూడా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ కుటుంబానికి చెందిన సభ్యులందరూ రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో అక్షయ అనే చిన్నారితో పాటు కుటుంబసభ్యులందరికీ తీవ్రగాయాలయ్యాయి. అయితే అక్కడ గుమిగూడిన ప్రజలు గాయాలతో బాధపడుతున్న కుటుంబాన్ని కాపాడాల్సింది పోయి... ప్రకాష్ రాజ్ ను ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. దీనిపై ప్రకాష్ రాజ్ తన ఆవేదనను ట్విట్టర్ లో వ్యక్తం చేశారు. ఆటోలోంచి రోడ్డు మీదకి విసిరేసినట్లుగా పడిపోయిన వారిని కాపాడకుండా... అక్కడ గుమిగూడిన చాలా మంది యువకులు తన ఫొటోలు తీయడంలో బిజీగా ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. చావుకు దగ్గర దాకా వెళ్లానన్న షాక్ కంటే... ప్రజల అమానవీయ ప్రవర్తనే తనను ఎక్కువగా కలచివేసిందని ఆయన అన్నారు. ఈ సంఘటన తలుచుకుంటేనే తనకు సిగ్గుగా ఉందని... మన యువత ఎటు పోతోందని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News