: అధికారం లేకపోతే అన్నీ వెనక్కిపోతాయి!
రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారాన్ని కోరుకోవడం సహజం. అధికారం ద్వారా సమకూరే సౌకర్యాలు, హోదా, దర్పం వారి ఆకాంక్షకు కారణమవుతాయి. అధికారం కోల్పోతే మాత్రం ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోవాల్సిందే. స్టేటస్ సింబల్ గా భావించే 'భద్రత' కూడా అంతే. తాజాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులకు భద్రత ఉపసంహరించాలని భద్రత సమీక్ష కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో 180, ఆంధ్రాలో 150 మంది మాజీలకు కల్పిస్తున్న భద్రతను పూర్తిగా ఉపసంహరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అంతేగాకుండా, తెలంగాణలో 35 మంది ప్రజాప్రతినిధులకు కల్పిస్తున్న 2+2 భద్రతను 1+1కు కుదించారు.