: పాక్ నైజం 523 సార్లు బయటపడింది
గత మూడేళ్లలో కాలంలో భారత్ లోనూ, విదేశాల్లోనూ విధులు నిర్వహిస్తున్న భారత్ కు చెందిన 340 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో పాక్ నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘన దాడుల్లో 27 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారని అన్నారు. మూడేళ్ల కాలంలో 523 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు.