: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట


గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈసారి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేశారు. జాతీయ పతాకావిష్కరణ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News