: టీఎస్ ప్రభుత్వం సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తే ఇకపై ఉపేక్షించం: సుజనా చౌదరి


తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తోందని... కావాలని సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తే ఇకపై ఉపేక్షించమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని... ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం చేయాలనుకుంటున్న సమగ్ర సర్వే రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. తెలుగు ప్రజలు ఇబ్బందులు పడకూడదంటే... ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ఢిల్లీలో ఏపీ ఎంపీల సమావేశంలో సుజనా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News