: సియాచిన్ పై రాజీ పడే ప్రసక్తే లేదు: మోడీ
జమ్మూకాశ్మీర్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ప్రారంభమైంది. లేహ్ లో ఆయన ఆర్మీ అధికారులు, జవాన్ల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ప్రేమే తనను ఇక్కడి దాకా రప్పించిందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. ప్రజల అభిమానాన్ని వడ్డీతో పాటు చెల్లిస్తానని చెప్పారు. ఈ ప్రాంత బలమేంటో తనకు తెలుసని... అదే సమయంలో ఇక్కడున్న సమస్యలు కూడా తనకు తెలుసని వెల్లడించారు. కాశ్మీర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సియాచిన్ పై రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. లెహ్ పర్యటనలో మోడీ నిమో బాగ్జో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. లెహ్-శ్రీనగర్ ట్రాన్స్మిషన్ లైన్ ను కూడా ఆయన ప్రారంభించారు.