: పీపీఏలపై తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తెరదించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ప్రతిపాదనలను ఏపీ జెన్‌కో ఉపసంహరించుకోవడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పింది. తమ అనుమతి లేని కారణంగా... విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీ డిస్కమ్స్) సమర్పించిన పీపీఎలను శూన్యమైనవిగా పరిగిణించలేమని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. 13పీపీఏల విద్యుత్తులో తెలంగాణాకు కచ్చితంగా వాటా అందాల్సిందేనని ఈఆర్సీ ఏపీ జెన్‌కోకు తెలిపింది. పీపీఏలకు తాము అనుమతి ఇవ్వకపోయినప్పటికీ... 12ఏళ్లుగా వాటికి సంబంధించిన టారిఫ్‌ను ఖరారు చేసి, వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని... అందువల్ల పీపీఏల అమలులో ఉన్నట్టేనని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సీ నిర్ణయంతో కరెంట్ కష్టాలతో సతమతమవుతోన్న తెలంగాణ రాష్ట్రానికి కాస్త ఉపశమనం లభించనుంది.

  • Loading...

More Telugu News