: జతకట్టినా... జనాన్ని మెప్పించలేకపోయారు!


నిన్నటిదాకా బద్ధ శత్రువులుగా మెలిగారు. కలిసిపోతేనన్నా తమ గీత మారుతుందేమోనని అంచనా వేశారు. కలిసిపోయారు. కలిసిపోయినా వారు జనాన్ని మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఈ కథ 23 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా మెలిగి, ఇటీవలే కలిసిపోయిన బీహార్ రాజకీయ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, నితిశ్ కుమార్ లదే. బీజేపీని నిలువరించే యత్నంలో భాగంగా కలిసిపోయిన లాలూ-నితీశ్ ల సోమవారం నాటి భారీ బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. పాట్నా సమీపంలో నిర్వహించిన ఈ సభకు వేల సంఖ్యలో జనం హాజరవుతారని భావించిన లాలూ, నితీశ్ లకు వందల మందే కనిపించడంతో దిమ్మతిరిగిపోయింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో తాము సాధించిన ఓట్ల శాతాన్ని హాజరైన జనంతో పోల్చుకుని చూసిన ఇరువురు నేతలు, తమ పార్టీ గ్రాఫ్ లు క్రమంగా దిగజారిపోతున్నాయని తెలిసిపోవడంతో లోలోపలే కుమిలిపోయారట.

  • Loading...

More Telugu News