: కేసీఆర్ వైఖరి 'ఏరు దాటాక బోడి మల్లన్న' అన్నట్టు ఉంది: సీపీఐ నారాయణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. గతంలో ఒకలా వ్యవహరించిన కేసీఆర్... అధికారంలోకి రాగానే మరోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఐలమ్మ, కొమరయ్యలను పొగిడినవారు... ఇప్పుడు వారి గురించి మాట్లాడటం కూడా మానేశారని అన్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న విధంగా కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అధికారికంగా గుర్తించి ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ని తాము కోరామని... తమ ప్రతిపాదనను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News