: బాల్ థాకరే కోరిక మన్నించిన ప్రణబ్


గతేడాది రాష్ట్రపతి ఎన్నికల ముందు ప్రణబ్ ముఖర్జీ ముంబాయిలోని శివసేన అధినేత బాల్ థాకరే స్వగృహం 'మాతోశ్రీ'కి వెళ్లారు. ఆయనను కలుసుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరి తీయాలని ఈ సందర్భంగా బాల్ థాకరే ప్రణబ్ ను కోరారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన పార్టీ ప్రణబ్ అభ్యర్ధిత్వానికే వోటేసింది.

ప్రణబ్ రాష్ట్రపతి అయ్యారు. మద్దతు ఇచ్చినందుకు
బాల్ థాకరే కు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం కారణంగా గత నవంబర్ 17న  బాల్ థాకరే కన్నుమూశారు. అఫ్జల్ క్షమాభిక్షను తిరస్కరించి, బాల్ థాకరే కోరికను ప్రణబ్ నేడు సఫలం చేసారు. కానీ, అఫ్జల్ ఉరి వార్తను వినడానికి నేడు బాల్ థాకరే మన మధ్య లేకపోవడమే విధి వైచిత్రి. ఈ విషయాన్ని శివసేన పార్టీయే వెల్లడించింది. అఫ్జల్ క్షమాభిక్షను తిరస్కరించినందుకు రాష్ట్రపతి ప్రణబ్ కు అభినందనలు తెలిపింది.

  • Loading...

More Telugu News